డిజిటల్ లైబ్రరీ న్యాయ వాదులకు వరం : జగ్జీవన్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు : డిజిటల్ లైబ్రరీ న్యాయవాదులకు వరం లాంటిదని  జిల్లా జడ్జి డాక్టర్ జగ్జీవన్ కుమార్ తెలిపారు.  కోర్ట్ లో డిజిటల్ లైబ్రరీ ఉండడంతో న్యాయవాదులు ఇంటర్నెట్ సహాయంతో జడ్జిమెంట్లు, సైటీషన్స్, ఆన్​లైన్​ అవసరాలకు ఎంతో ఉపయోగకరమన్నారు. శుక్రవారం జిల్లా కోర్టు లో డిజిటల్ క్లాస్ రూమ్ ను జడ్జి జగ్జీవన్ కుమార్ ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేసిన బార్ అసోసియేషన్ ను జడ్జి అభినందించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దిరిశాల కృష్ణారావు, లైబ్రరీ కార్యదర్శి గాజుల అమర్ నాథ్, బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మన్నేపల్లి బసవయ్య, ఉపాధ్యక్షుడు మాధిరాజు లక్ష్మీ నారాయణ, కోశాధికారి ఎంజే ప్రవీణ్, విజయ రాఘవ, మహిళా ప్రతినిధి కేవీవీ లక్ష్మి, సింగం జనార్దన్, ఇందిరా, అరుణ పాల్గొన్నారు.