నల్గొండ అర్భన్, వెలుగు : ఈనెల 30న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్ చార్జి జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ వెల్లడించారు. బుధవారం జిల్లా కోర్టులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోక్ అదాలత్ సందర్భంగా రాజీ కాదగిన కేసులు అన్నింటిని పరిష్కరించుకోవచ్చన్నారు.
జిల్లాలో మొత్తం 4 లక్షలా 29 వేల 131 వాహన చలాన్లు పెండింగ్లో ఉన్నాయని, ప్రభుత్వం కల్పించిన రాయితీలతో చెల్లిస్తేనే ఒక్క నల్గొండ జిల్లాలలోనే సుమారు రూ.24 కోట్ల మేరా వసూల్ అవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జీ డీవీఆర్. తేజో కార్తీక్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ దీప్తి, డీఎస్పీలు శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి పాల్గొన్నారు.