
జిన్నారం, వెలుగు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా జడ్జి ప్రభాకర్ రావు దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ ట్రస్ట్ చైర్మన్ రామోజీ రావు జడ్జి ప్రభాకర్ రావుకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ చరిత్ర గురించి చైర్మన్ వివరించారు. ఇటీవల జిన్నారం మండలానికి కోర్టు శాంక్షన్ కావడం తో జిల్లా జడ్జి ప్రభాకర్ రావు మండలానికి వచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శివరాజ్, శ్రీశైలం యాదవ్, ఎస్ఐ విజయ్ రావు, అధికారులు పాల్గొన్నారు .