చేర్యాల, వెలుగు: చేర్యాల మండల కేంద్రంలోని పాత ఎంపీడీవో ఆఫీసులో జూనియర్సివిల్కోర్టు ఏర్పాటు చేస్తుండడంతో గురువారం ఆ భవనాన్ని జిల్లా జడ్జి సాయి రమాదేవి, కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. హైవే నుంచి కోర్టు లోపలికి వచ్చే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కోర్టు ఆవరణలో ప్లాంటేషన్ చేయాలని సూచించారు. కోర్టు ప్రారంభానికి వీఐపీలు వస్తుండడంతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఏసీపీ సతీశ్‌కి సూచించారు.
ఆదేశించారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, బార్ కౌన్సిల్ సభ్యులందరూ సమన్వయంతో కోర్టు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సదానందం, తహసీల్దార్సమీర్అహ్మద్ఖాన్, మున్సిపల్ కమిషనర్నాగేందర్, ఎంపీడీవో మహమూద్ అలీ, విద్యుత్ ఏడీఈ వెంకట్‌గౌడ్, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్జనార్ధన్ రెడ్డి, అడ్వకేట్లు వీరమల్లయ్య, మనోహర్, రవీందర్పాల్గొన్నారు.