
కామారెడ్డి టౌన్, వెలుగు : స్కానింగ్ సెంటర్లలో రికార్డులు పక్కగా ఉండేలా అధికారులు చూడాలని జిల్లా జడ్జి వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో హెల్త్ డిపార్మెంట్ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ పరీక్ష చట్టం అమలుపై జరిగిన మీటింగ్‌లో జడ్జి మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లను తరచూ తనిఖీలు చేయాలని, లింగ నిర్ధారణ టెస్టులు చేస్తే గుర్తింపులు రద్దు చేయాలన్నారు. అనంతరం హాస్పిటల్స్ పర్మిషన్లపై చర్చించారు. రూల్స్ పాటించని హాస్పిటల్స్‌కు పర్మిషన్లు ఇవ్వకూడదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, అధికారులు శిరిష, విద్య, ప్రభుకిరణ్, ఐఎంఏ సెక్రటరీ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.