ఇల్లెందు,వెలుగు : ఇల్లెందు కోర్టులో వసంత పాటిల్ఖాళీగా ఉన్న సిబ్బందిని త్వరలోనే భర్తీ చేస్తారని జిల్లా జడ్జి వసంత పాటిల్ తెలిపారు.శనివారం ఇల్లెందు పీడీఎం కోర్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఇల్లెందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బాడీ ఆధ్వర్యంలో కోర్టు హాల్ లో శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఇల్లెందులో నూతనంగా నిర్మించబోయే కొత్త భవనాలకు నిధులు త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోర్టులో పలు రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోర్టుకోర్టు సిబ్బంది త్వరలోనే భర్తీ ఏఓ అనిత వాణి, జిల్లా కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడి సత్య ప్రకాశ్, వైస్ ప్రెసిడెంట్ భూక్య రవికుమార్ నాయక్, జాయింట్ సెక్రటరీ కీర్తి కార్తిక్, ట్రెజరర్ కె. ఉమామహేశ్వరరావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.