అసెంబ్లీలో కిడ్నీ బాధితుల సమస్యలు ప్రస్తావించాలి

అసెంబ్లీలో  కిడ్నీ బాధితుల సమస్యలు ప్రస్తావించాలి

బాల్కొండ, వెలుగు:  కిడ్నీ బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని జిల్లా కిడ్నీ బాధితులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కోరారు. సోమవారం వేల్పూర్ లోని ఆయన నివాసంలో  కలిసి నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్, డయాలసిస్ బాధితులు  వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు.

 ప్రజాభవన్ కు వెళ్లి తమ సమస్యలు విన్నవించినా ఎలాంటి స్పందన లేదని వాపోయారు. రానున్న అసెంబ్లీ మీటింగ్ లో తమ సమస్యలపై ప్రస్తావించి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.  తమ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలను కలుస్తున్నట్లు పేర్కొన్నారు. 

కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ పేషంట్లకు ప్రతీ నెలా మందులకు రూ.10 వేలకు పైగా ఖర్చు అవుతోందని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరి కిడ్నీ బాధితులకు ప్రతీనెల రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

బాల్కొండ శివాలయంలో టీజీఎండీసీ చైర్మన్ పూజలు

బాల్కొండ, వెలుగు: బాల్కొండ శివాలయంలో తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ సోమవారం పూజలు చేశారు. స్థానిక లీడర్లతో కలిసి శివయ్యను దర్శించుకున్న ఆయనకు కమిటీ సభ్యులు జ్ఞాపికను అందజేశారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.