
శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్‌ను గురువారం జిల్లా లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ సంతోష్ తనిఖీ చేశారు. పెట్రోల్తక్కువొస్తుందని బుధవారం పలువురు వాహనదారులు ఆందోళన చేయడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన తనిఖీ చేసి 20 ఎం.ఎల్. తక్కువ వచ్చినందున బంక్‌ను క్లోజ్ చేసినట్టు తెలిపారు. మళ్లీ తాము సర్టిఫై చేసిన తర్వాత బంక్ ఓపెన్ చేస్తామన్నారు.