పని ప్రదేశంలో లైంగికంగా వేధిస్తే కఠిన శిక్షలు : రజని

పని ప్రదేశంలో లైంగికంగా వేధిస్తే  కఠిన శిక్షలు : రజని
  •     జిల్లా లీగల్​ సర్వీసెస్​ సెక్రటరీ రజని

వనపర్తి, వెలుగు : పనిచేసే  ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని జిల్లా లీగల్​ సర్వీసెస్​ అథారిటీ సెక్రటరీ, జడ్జి  వి రజని అన్నారు. శనివారం కలెక్టరేట్​లో  మహిళా ఉద్యోగుల వేధింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  పని ప్రదేశాలలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీల్లో  మహిళలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.  

ఎస్సీ, ఎస్టీ  వికలాంగులకు, మహిళలకు, వరద బాధితులకు మూడు లక్షల లోపు  ఆదాయం ఉన్న వారందరికీ  ఉచిత న్యాయ సహాయం అందుతుందని తెలిపారు.  ఉచిత న్యాయ సహాయం  పొందేందుకు  టోల్ ఫ్రీ నంబర్ 15100   కాల్ చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా వెల్ఫేర్​ ఆఫీసర్​ సుధారాణి, స్పెషల్​ డెప్యూటీ కలెక్టర్​ ప్రమోదిని, డీఆర్​డీవో   ఉమాదేవి, జిల్లా ఇమ్యూనైజేషన్​ ఆఫీసర్​ ప్రమీల, ఆర్డీఎస్​ డైరెక్టర్​ చిన్నమ్మ థామస్  తదితరులు పాల్గొన్నారు.