జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

జిల్లాస్థాయి సీఎం కప్ పోటీలు ప్రారంభం

జనగామ అర్బన్, వెలుగు: జిల్లాస్థాయి సీఎం కప్–2024 పోటీలను జనగామ కలెక్టర్ ​రిజ్వాన్​బాషా షేక్ సోమవారం డీసీపీ రాజమహేంద్ర నాయక్​, మున్సిపల్​ చైర్​పర్సన్​ పోకల జమునతో కలిసి జెండాను ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వాలీబాల్, బ్యాడ్​మెంటన్, బేస్​బాల్ క్రీడలని వారు ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీవైఎస్​వో వెంకట్​రెడ్డి, మున్సిపల్​కమిషనర్​వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.