జనగామ అర్బన్, వెలుగు: ఈ నెల 21న జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐత కిషన్ తెలిపారు. లింగాలఘనపురం బైపాస్ రోడ్లో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచనవారు సిద్దిపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.
గురువారం ఉదయం 9 గంటలకు పోటీలు మొదలవుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు సొంత సైకిళ్లతో పాటు బర్త్, బోనాఫైడ్ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 91824 59617 కాల్చేయొచ్చన్నారు.