డీఎస్సీ 2024లో మొదటి ర్యాంకు సాధించిన అబ్బాపూర్ యువకుడు

 డీఎస్సీ 2024లో మొదటి ర్యాంకు సాధించిన అబ్బాపూర్ యువకుడు

ములుగు/ తొర్రూరు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2024లో ఎస్జీటీ విభాగంలో ములుగు మండలం అబ్బాపూర్ యువకుడు జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. గ్రామానికి చెందిన మోటపోతుల రాణి ఆనందం దంపతులకు కొడుకు అరుణ్ జులై 19న జరిగిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేయగా, ములుగు జిల్లాస్థాయిలో అరుణ్​ మొదటి ర్యాంకు సాధించాడు.

కాగా, అరుణ్ తన తల్లిదండ్రులతోపాటు గురువులకు కృతజ్ఞతలు తెలిపాడు. మహబూబాబాద్​జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన దొంతోజు గీత డీఎస్సీలో జిల్లా స్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. ఫతేపురానికి చెందిన వల్లపు యాకన్న స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ విభాగంలో జిల్లా మూడు ర్యాంకు సాధించారు. జిల్లా స్థాయి ర్యాంకులు రావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్​

ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు అక్టోబర్ 1న సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు ములుగు డీఈవో జి.పాణిని ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం డీఈవో ఆఫీస్​లో సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.