
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా సైన్స్ సెంటర్లో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. సైన్స్ అండ్టెక్నాలజీతో పాటు ప్రపంచ నీటి సంక్షోభం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విపత్తులను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికతలు, ఆరోగ్యం, పరిశుభ్రత, వాతావరణ మార్పు దాని ప్రభావం అంశాలపై పోటీలు నిర్వహించారు. కాసిపేట మోడల్స్కూల్విద్యార్థులు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి అక్టోబర్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్బెపల్లి జడ్పీఎస్ఎస్ విద్యార్థులు సెకండ్ ప్లేస్‌లో నిలిచారు. సైన్స్ ఆఫీసర్ మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో చీఫ్ గెస్ట్‌గా డీఈవో యాదయ్య పాల్గొన్నారు