కుంటాలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

కుంటాలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

కుంటాల, వెలుగు: జిల్లా స్థాయి అండర్ 16 సబ్ జూనియర్ కబడ్డీ పోటీలు బుధవారం కుంటాలలో ప్రారంభమయ్యాయి. పోటీలను స్థానిక విజయ సాయి స్కూల్​లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సునీల్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను వికారాబాద్​లో ఈ నెల 20 నుంచి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు సెలక్ట్ చేయనున్నట్లు ఈవెంట్ ఇంచార్జి  శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రేమలత తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పంగెర స్వప్న, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.