సుల్తానాబాద్, వెలుగు: స్కూల్ గేమ్స్ జిల్లా ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ కాలేజీ గ్రౌండ్‌లో పెద్దపల్లి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు గురువారం నిర్వహించారు. ఉదయం మున్సిపల్ చైర్‌పర్సన్ గాజుల లక్ష్మి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. అండర్–17, అండర్–14 విభాగాల్లో సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు.
అండర్ 17 బాయ్స్ విభాగంలో సుల్తానాబాద్ ఫస్ట్, రామగుండం సెకండ్ ప్లేస్‌లో నిలిచాయి. గర్ల్స్ విభాగంలో రామగుండం ఫస్ట్, పెద్దపల్లి సెకండ్, అండర్ 14 బాయ్స్ విభాగంలో సుల్తానాబాద్ ఫస్ట్, రామగుండం సెకండ్, గర్ల్స్ విభాగంలో సుల్తానాబాద్ ఫస్ట్, పెద్దపల్లి జట్టు రన్నర్‌గా నిలిచాయి. డీవైఎస్‌వో సురేశ్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, జోనల్ కార్యదర్శి దాసరి రమేశ్, కిశోర్, తిరుపతి, డి. ప్రసాద్ పాల్గొన్నారు.