- ఈడీఎం దేవేందర్
ములుగు, వెలుగు : మీ సేవ సర్వీసు ద్వారా జిల్లాలోని ప్రజలందరికీ కొత్తగా 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయని, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ తెలిపారు. గురువారం ములుగులోని మీ సేవా కేంద్రాల్లో వినియోగదారులకు నూతన సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈడీఎం దేవేందర్ మాట్లాడుతూ.. కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి 6 రకాల సర్వీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 2 రకాల సర్వీసులు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సీనియర్ సిటిజెన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్వీసు అందుబాటులోకి వచ్చాయన్నారు.
గ్యాప్ సర్టిఫికెట్, నేమ్ చేంజ్ అఫ్ సిటిజన్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫి కెట్, ఆదాయం, కులం సర్టిఫికెట్ రెన్యువల్, క్రిమిలేయర్, నాన్- క్రిమిలేయర్ సర్టిపికెట్, సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ మానిటరింగ్ సిస్టం అప్లికేషన్, తదితర సేవలను అందించనున్నారన్నారు. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఎలాంటి తప్పులు లేకుండా అప్లికేషన్ చేయాలని సూచించారు.