జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్ ఏరియా పరిధిలో ఉన్న మీ-సేవా కేంద్రాన్ని బుధవారం ఈ-జిల్లా మేనేజర్ దుర్గారావు తనిఖీ చేశారు. మీ-సేవా కేంద్రంలో పని విధానాన్ని పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీ, తదితర పనుల్లో అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ మీ-సేవా కేంద్రాల్లో ఆన్లైన్ లావాదేవాలను అమలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.