పత్తి కొనుగోలులో ప్రమాణాలు పాటించాలి : పద్మావతి

జమ్మికుంట, వెలుగు : జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి  పద్మావతి అన్నారు. వ్యవసాయ మార్కెట్లో గురువారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏడీఏ పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నాలుగు సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేశామని, కరీంనగర్, చొప్పదండి, గోపాల్ రావు పేట, జమ్మికుంటలో 11 మిల్లుల్లో కొనుగోలు జరుగుతాయని దీనిలో జమ్మికుంట లోని 6 పత్తి మిల్లులో సిసిఐ కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు 8 నుంచి 12 శాతం వరకు మాత్రమే ఉన్నపత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీఐ అధికారి చంద్రశేఖర్, మార్కెట్ సెక్రటరీ రెడ్డి నాయక్ తో పాటు కొనుగోలుదారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.