- జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్
చండూరు(మర్రిగూడ, నాంపల్లి), వెలుగు : సీజనల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సూచించారు. సోమవారం మర్రిగూడ, నాంపల్లి మండల కేంద్రాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్వో మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతిఒక్కరూ పరసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించి సీజనల్వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయన వెంట దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్రవి, వైద్యాధికారులు దీపక్, శంకర్, సుమన్, ఇజ్రత్, తరుణ్, సిబ్బంది ఉన్నారు.