మణుగూరు ప్రైవేట్ హాస్పిటల్స్ లో తనిఖీలు

మణుగూరు ప్రైవేట్ హాస్పిటల్స్ లో తనిఖీలు
  • రెండు ల్యాబ్ లు, ఒక ఆపరేషన్ థియేటర్ సీజ్ 
  •   హాస్పిటల్స్ కు షోకాజ్ నోటీసులు

మణుగూరు, వెలుగు: మణుగూరులోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేపట్టారు. డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో మండలంలోని ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్లలో  తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రెండు ప్రైవేటు ల్యాబ్ లు ఒక ఆపరేషన్ థియేటర్ ను సీజ్ చేశారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని రెండు హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో డీఎంహెచ్‌‌‌‌వోతో పాటు డీఐఓ డాక్టర్ బాలాజీ నాయక్, డీటీసీఓ డాక్టర్ కళ్యాణ్, మణుగూరు ఏరియా హాస్పిటల్ డాక్టర్ శివకుమార్, డీఈఎంఓ ఫయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.