ఆఫీసర్ల క్వార్టర్స్‌‌‌‌ను 9 కోట్లతో నిర్మించి.. ఖాళీగా ఉంచారు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల కలెక్టరేట్ ​సమీపంలో నిర్మించిన జిల్లా ఆఫీసర్ల క్వార్టర్స్‌‌‌‌ నిరుపయోగంగా మారాయి. మూడేళ్ల కింద సుమారు రూ. 9 కోట్లతో కలెక్టర్, ఇద్దరు అడిషనల్​కలెక్టర్లకు క్యాంప్  ఆఫీసులతోపాటు 8 మంది జిల్లా ఆఫీసర్లు ఫ్యామిలీస్‌‌‌‌తో నివసించేలా బిల్డింగ్‌‌‌‌లు నిర్మించారు. నిర్మాణం పూర్తవడంతో కలెక్టర్‌‌‌‌‌‌‌‌, అడిషనల్​కలెక్టర్లు అందులోనే నివాసం ఉంటుండగా ఇతర అధికారుల కోసం నిర్మించిన రెండు బిల్డింగ్‌‌‌‌లను ఎవరికీ కేటాయించలేదు.

కాగా 2022లో మూడు నెలలు మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ నిర్వహించారు. అసెంబ్లీ ఎలక్షన్​టైంలో కొన్ని రోజులు ఓ ఆఫీసర్ కు కేటాయించడంతో వారం ఉండి ఖాళీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరికీ కేటాయించకపోవడంతో రూ.కోట్లతో కట్టిన బిల్డింగులు నిరుపయోగంగా ఉంటున్నాయి.