బోధన్,వెలుగు : బోధన్ మండల స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా పంచాయతీ అధికారి సీహెచ్ తరుణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. స్పెషల్ అధికారికి ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మధుకర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీపీవో సీహెచ్తరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో మండల ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.
బోధన్ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, గ్రామీణ ప్రజలు ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకవస్తే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గ్రామాలాభివృద్దికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.