- జిల్లా పరిధిలో ఉన్న 71 కిలోమీటర్ల రోడ్డుపై
- బ్లాక్ స్పాట్స్ వద్ద యూటర్నులు క్లోజ్ చేయాలని నిర్ణయం
- పర్మిషన్ లేని వ్యాపార సముదాయాలపై చర్యలకు సీపీ ఆదేశం
నిజామాబాద్, వెలుగు: జిల్లా మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్44 పై జరుగుతున్న యాక్సిడెంట్స్‌పై జిల్లా పోలీస్కమిషనర్కల్మేశ్వర్ ఫోకస్ పెట్టారు. ఈ హైవే పరిధిలోనిడిచ్పల్లి పోలీస్సర్కిల్లో అత్యధిక ప్రమాదాలు జరిగి, ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అంశాలపై స్టడీ షురూ చేశారు. వీలైనంత మేరకు ప్రమాదాలు తగ్గించడానికి బ్లాక్‌స్పాట్స్ గుర్తించి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
యూటర్నులు క్లోజ్
జిల్లాలో ఇందల్వాయి స్టేషన్ పరిధిలోని దగ్గి ఫారెస్ట్ఏరియా నుంచి మెండోరా చాక్రియాల్ చౌరస్తా వరకు 71 కిలోమీటర్ల పొడవున ఎన్‌హెచ్44 విస్తరించి ఉంది. ఈ రోడ్డుపై 2023లో 767 యాక్సిడెంట్లు జరిగాయి. 337 మంది ప్రాణాలు కోల్పోగా, తీవ్రగాయాలతో 203 మంది దివ్యాంగులయ్యారు. 2022లో జరిగిన 674 ప్రమాదాల్లో 340 మంది మృతి చెందారు. రోడ్డుపై 12 చోట్ల అత్యధికంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నట్లు సీపీ కల్మేశ్వర్ గుర్తించారు.
12 బ్లాక్ స్పాట్స్ వద్ద యూటర్నులు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. పర్మిషన్ లేని దాబాలు, వ్యాపార సముదాయాలపై యాక్షన్ తీసుకోవాలని సీపీ ఆదేశించారు. వెహికల్స్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి, రేడియం స్టిక్కర్లు అంటించాలని, పార్కింగ్స్థలాల్లోనే వెహికల్స్ పార్క్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఇందల్వాయి టోల్గేట్ మేనేజ్మెంట్కు ఆర్డర్స్
జారీ చేశారు.