
మెదక్‌టౌన్, వెలుగు: ఎన్నికల నియమావళిలో భాగంగా గురువారం మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, మీడియా సెంటర్‌ను జిల్లా పోలీస్ పరిశీలకుడు రామేశ్వర్సింగ్పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును చెక్ చేశారు. సీ-విజిల్ యాప్‌లో వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్ పనితీరు, మీడియాలో వచ్చే వార్తలు, పెయిడ్ న్యూస్, పత్రిక ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియా రికార్డింగ్ పనితీరును ఎంసీఎంసీ నోడల్ అధికారి రామచందర్ రాజును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సీజ్ అయిన డబ్బు, మద్యం, కేసుల వివరాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ బాలస్వామి, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.