
జగిత్యాలలో పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే అభ్యర్థులకు జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. ఫ్రీ కోచింగ్ తీసుకునే అభ్యర్థుల ఎంపిక కోసం జిల్లా SP సింధు శర్మ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్ట్ కోసం యువతీ యువకులు పెద్దఎత్తున హాజరయ్యారు. సుమారు 2 వేల మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగులపై భారం పడకుండా ఉండేందుకు ఉచిత కోచింగ్ అందిస్తున్నామని జగిత్యాల పోలీసు అధికారులు తెలిపారు. అర్హత ఉన్న వారికి ఉచిత కోచింగ్ అందిస్తున్నామని చెప్పారు. క్యాండిడేట్లను ఎంపిక చేసి రేపటి నుంచి కోచింగ్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
మరిన్ని వార్తల కోసం