ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలి : రామకృష్ణారెడ్డి

మోత్కూరు, వెలుగు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రజా సమస్యలపై ఫోకస్​ పెట్టాలని బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సూచించారు.  ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఇసుక రవాణా, అవిశ్వాసాలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టారని ఆరోపించారు. ఆదివారం మోత్కూరు మండలం దత్తప్పగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా కాంగ్రెస్​ నాయకులు మున్సిపాలిటీలు, సింగిల్ విండో పాలకవర్గాలను కూల్చడానికి కౌన్సిలర్లు, డైరెక్టర్లను కొనుగోలు చేసి అవిశ్వాసాలతో చేజిక్కించుకుంటున్నారని ఆరోపించారు. మోత్కూరు సింగిల్ విండోలో అవినీతి జరిగిందని ఎమ్మెల్యే ఎంక్వైరీకి ఆదేశించడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. 

అయితే, అందులో తాము రూ.కోట్లు కాదు.. రూపాయి తిన్నట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పొన్నెబోయిన రమేశ్, జంగ శ్రీను, ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేశ్, కొండా సోంమల్లు, రాంపాక నాగయ్య, పానుగుళ్ల విష్ణు, అండెం రాజిరెడ్డి, మల్లం అనిత, పురుగుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.