ఉద్యమకారులకు కాంగ్రెస్​ పార్టీ గుర్తిస్తోంది : పొదిల వెంకటేశ్వర్లు

ఖమ్మం టౌన్,వెలుగు :  తెలంగాణ   ఉద్యమకారుల పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తోందని ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పొదిల వెంకటేశ్వర్లు అన్నారు.   నగరంలోని రిక్కాబ్ బజార్ లోని ఉద్యమకారుల జిల్లా ఆఫీస్ లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.    

ఆయా నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి,  మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తమ సంఘం తరపున అభినందనలు తెలియజేశారు. ఈసమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అర్వపల్లి సుధాకర్, కోశాధికారి బూర్ల పుల్లారావు,షేక్​ సలీమ్​, కొమర్రాజు మాధవరావు, ఇవి.రెడ్డి పాల్గొన్నారు.