ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ముంపు ముప్పు : జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ

  •    బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ 

హనుమకొండ, వెలుగు : ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరంగల్ సిటీ ముంపునకు గురవుతోందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ విమర్శించారు. భారీ వర్షాల కారణంగా వరంగల్​ నగరంలో ముంపునకు గురైన కాలనీలను ఆమె బుధవారం పరిశీలించారు. సమ్మయ్యనగర్​, హంటర్​ రోడ్డు సాయి నగర్​ ప్రాంతాల్లో పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు.

అనంతరం  పునరావాస కేంద్రంలో ప్రజలకు ఆహార పదార్థాలు అందించారు. ఆమె వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశిని సదానందం గౌడ్​, పార్టీ వివిధ డివిజన్ల అధ్యక్షుడు యాదగిరి, రఘు, జగన్, నాయకులు నర్సింగ్, పవన్, గౌతం పాల్గొన్నారు.

బాధితులకు పరామర్శ : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి 

సంతోషిమాతా ఫంక్షన్ హాల్ పునరావాస కేంద్రంలో    బాధితులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి   పరామర్శించారు. అంతకు ముందు   రామన్నపేట, తోషిమాత కాలనీ, ఎన్టీఆర్​ నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోఆయన పర్యటించారు.