పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : రావు పద్మ 

హనుమకొండ, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పనైపోయిందని, ఇక నుంచి ఏ ఎన్నిక అయినా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. హనుమకొండ లో గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలు ఏడు నెలలైనా అమలు కాలేదన్నారు. ఆ పార్టీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, అందుకే ఎంపీ ఎన్నికల్లో 9 స్థానాల్లో ఓటమి చెందిందన్నారు.

బీజేపీ 8 ఎంపీ సీట్లు నెగ్గి రికార్డు సృష్టించిందని, బీఆర్​ఎస్​ పార్టీ అడ్రస్ గల్లంతైందన్నారు. ప్రజా సమస్యల పై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేయాలని, క్షేత్రస్థాయి సమస్యలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. - బీజేపీకి పని చేస్తే భారత మాత కోసం పని చేసినట్టేనని చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి, మాజీ మంత్రి డా.విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, అరూరి రమేశ్​, ఒంటేరు జయపాల్ పాల్గొన్నారు.