
మెదక్ టౌన్, వెలుగు : మెదక్నియోజకవర్గంలో బీజేపీ గెలుపునకు ప్రతి కార్యకర్త పని చేయాలని మెదక్ జోనల్ఇన్చార్జి, కర్నాటక ఎమ్మెల్యే అభయ్పటేల్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మెదక్ నియోజకవర్గానికి చెందిన ఆయా విభాగాల బాధ్యులతో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ్ పటేల్ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్‌లో ఉన్న కమిటీని బలోపేతం చేస్తూ మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలు తెలియజేయాలని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ వైఫల్యాలను, మోసాలను ప్రజలకు చేరేలా ప్రచారం చేయాలని సూచించారు.