- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల టౌన్, వెలుగు: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీస్ సంస్మరణ దినోత్సవ (ఫ్లాగ్ డే)లో భాగంగా గురువారం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్ స్టేషన్ పని తీరు, డయల్100 గురించి వివరించారు. డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ కృష్ణ, ఆర్.ఐ లు యాదగిరి, రమేశ్ మధుకర్, ఆర్.ఎస్.ఐ సాయికిరణ్, సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.
పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్
కోరుట్ల,వెలుగు: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా కోరుట్ల, కథలాపూర్ పోలీస్ స్టేషన్ లో గురువారం ఓపెన్ హౌస్ నిర్వహించారు. కోరుట్ల , కథలాపూర్ ఎస్సైలు శ్రీకాంత్, నవీన్ అవగాహన కల్పించారు.
హుజురాబాద్, వెలుగు: విద్యార్థులు బాధ్యతతో వ్యవహరించాలని శాంతి భద్రతలు కాపాడడంలో ముందుండాలని ఏసీపీ శ్రీనివాస్ జి అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఏసీపీ శ్రీనివాస్ జి ప్రారంభించగా.. మండలంలోని స్కూళ్లు, కాలేజీలకు చెందిన దాదాపు500 మంది కి పైగా విద్యార్థులు సందర్శించారు. హుజురాబాద్, జమ్మికుంట సీఐలు తిరుమల్ గౌడ్, రవి, డివిజన్ స్థాయి సీఐలు, ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.