ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీం తిరుగుతున్నట్లు సమాచారం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు. ఆదివారం ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. వివిధ మండల కేంద్రాల్లో యాక్షన్ టీం సభ్యుల వివరాలను ఫొటోలతో విడుదల చేశారు. ఎన్నికలకు భంగం కలిగించేందుకు ఛత్తీస్ఘడ్ నుంచి జిల్లాకు యాక్షన్ టీం వచ్చిందన్నారు.
అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. కుంజం ఇడుమల్ అలియాస్ మహేందర్, కొవ్వాసి గంగ అలియాస్ మహేశ్, ముస్సకి దేవల్ అలియాస్ కరుణాకర్, వెట్టి దేవ అలియాస్ బాలు, పొట్టం అడుమ అలియాస్ సంజు అలియాస్ సంజీవ్, వెట్టి లక్మ అలియాస్ కల్లులతో ప్రత్యేక యాక్షన్ టీమ్ ను ఏర్పాటు చేసినట్లు తెలిసిందన్నారు. ఇటీవల ఈ టీమ్ ములుగు ఏరియాలోకి ప్రవేశించిందని వివరించారు.
మావోయిస్టులలను అరికట్టడంతో పాటు ఎన్నికలను విజయవంతం చేసేందుకు ప్రజలు అన్ని విధాలుగా పోలీసులకు సహకరించాలని ఎస్పీ గౌస్ ఆలం కోరారు.