వనపర్తి టౌన్, వెలుగు: స్టూడెంట్లు ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ నకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్, డీపీఎం బాషా నాయక్ , అరుణ, వనపర్తి యూనియన్ బ్యాంక్ మేనేజర్ శేఖర్ రెడ్డి, రిసోర్స్ పర్సన్ అశోక్ పాల్గొన్నారు.