- ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి, ఆత్మకూరు, వెలుగు: పోలీసులకు విధుల పట్ల అంకితభావం ఉండాలని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. మంగళవారం ఆయన ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యతన్నారు.
పట్టణంలో అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించినా వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్ శివకుమార్, ఎస్సై నరేందర్ పోలీసు సిబ్బంది ఉన్నారు. .