వనపర్తి, వెలుగు : కొత్త చట్టాలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్అన్నారు. మంగళవారం ఆయన ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ను విజిట్ చేసి రికార్డులు పరిశీలించారు. పలు కేసుల వివరాలను గురించి ఎస్‌ఐ నరేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా సమగ్ర విచారణ
చేపట్టి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. సమావేశంలో ఆత్మకూరు సీఐ, ఎస్సైలు, ఏఎస్ఐలు పాల్గొన్నారు.