సూర్యాపేట, వెలుగు : సీసీ కెమెరాలు సమాజంలో రక్షణగా పని చేస్తాయని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సహకారంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో 60 ఫీట్ల రోడ్డులో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. విరాళాలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు అందించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పోలీసులతో భాగస్వామ్యం కావాలని కోరారు. విద్యార్థులు చదువులు, క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు. యువత, చెడు అలవాట్లకు, చెడు ప్రలోభాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం పోలీసు కళజాత బృందం సభ్యులు పాటలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవి, పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు కుశలవ, ఏడుకొండలు, వెంకట్‌రెడ్డి, విరాళాలు అందించిన విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.