
నిజామాబాద్, వెలుగు : వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తాగునీటి సమస్య ఉన్న ఆవాసాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. రిపేరింగ్ బోర్లు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. గ్రామాల్లో వాటర్ ట్యాంకర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ టౌన్లలో తాగునీటి సరఫరా చేసే జలాశయాల్లో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు.
మండలాల్లో ఎంపీడీవో, ఎంపీవోతో కూడిన క్లస్టర్ టీంలు నిరంతర పర్యవేక్షించాలన్నారు. వారంలో ఒక రోజు మండల స్పెషల్ ఆఫీసర్లను విజిట్‌కు పంపి గ్రౌండ్ రియాల్టీ సేకరిస్తామని ఎక్కడా నీటి కొరత రాకుండా చూస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక కమిషనర్ దిలీప్ కుమార్, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నీటి కొరత రాకుండా చూడాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : ఎండ కాలంలో జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ , స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ.శరత్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కామారెడ్డి జిల్లాకు వచ్చారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో పలు అంశాలపై చర్చించారు.