భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలంలోని గొత్తికోయల గ్రామంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ సురేంద్రమోహన్ మంగళవారం పర్యటించారు. క్రాంతినగర్ హ్యాబిటేషన్‌లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించారు. గ్రామపంచాయతీ కల్పిస్తున్న సౌకర్యాల గురించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఎండలో విశ్రాంతి కోసం వేసిన షెడ్ నెట్‌ను పరిశీలించారు. రోజూ కూలి రూ. 300 వచ్చేలా పని చేయాలని ఆయన సూచించారు.
క్రాంతినగర్‌లో నివసిస్తున్న గొత్తికోయలతో మాట్లాడారు. తాగు నీటి ఎద్దడి నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. 30 మంది పిల్లలున్నా అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో అక్కడ ప్రత్యేకంగా అంగన్వాడీ స్కూల్ ఏర్పాటుకు పరిశీలన చేయాలని ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్డీవో విద్యాచందన, ఎంపీడీవో చలపతిరావు, ఎంపీవో శ్రీనివాసరావు, ఏఈఈ వెంకటస్వామి, గ్రామపంచాయతీ సెక్రటరీ కే. వంశీకృష్ణ పాల్గొన్నారు.