బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు..జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్, వెలుగు: ఈనెల 30 నుంచి అక్టోబరు 2 వరకు ఆర్మూర్ లో జరగనున్న 42వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాట్మింటన్​క్రీడా పోటీలకు జిల్లా జట్టు ఎంపికయ్యింది. ఎంపికైన జట్టుకు ఆర్మూర్ లోని నవ్య భారతి గ్లోబల్ స్కూల్ లో  గురువారం శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. 

ALSO READ : World Cup 2023: పాక్ జట్టుకు భద్రత కల్పించేందుకు హైదరాబాద్ పోలీసులు 'ఓవర్ టైమ్'

జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి విశాఖ గంగారెడ్డి, బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ మాట్లాడుతూ.. జిల్లాను రాష్ట్ర స్థాయి పోటీలో ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు.