జనవరి 27 నుంచి తెలంగాణ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌

జనవరి 27 నుంచి తెలంగాణ జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌

తెలంగాణ జిల్లాల అండర్‌-17 టీ20 క్రికెట్‌ టోర్నమెంట్‌  జనవరి  27 నుంచి ప్రారంభం కానుంది.   హైదర్‌గూడలో  తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షులు, శాట్‌ మాజీ చైర్మెన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎన్నారై  డాక్టర్ నాథ రమణ మూర్తి గోకుల, శ్రీనివాస్‌ రెడ్డిలతో కలిసి   ప్రముఖ అంకాలజిస్ట్‌, ఎన్నారై డాక్టర్  సతీశ్‌ కత్తుల పోస్టర్ ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన  సతీశ్ కత్తుల .. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ది చెందాలన్నారు.  ఈ టోర్నమెంట్‌ నిర్వహణతో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి రానుండటం అభినందనీయమన్నారు. 

ఈ టోర్నమెంట్‌లో ఉమ్మడి 9 జిల్లాలు సహా టీడీసీఏ ఎలెవన్‌ జట్లు పోటీపడుతున్నాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి అన్నారు.  టోర్నమెంట్‌లో ప్రతిభ చూపిన క్రికెటర్ల నుంచి మూడు జట్లను తయారు చేస్తామన్నారు.. మార్చి మూడో వారంలో అమెరికా క్రికెట్‌ అకాడమీ జట్టు ఇక్కడికి రానుందన్నారు.  తెలంగాణ ఉమ్మడి జిల్లాల జట్లు, అమెరికా క్రికెట్‌ అకాడమీ జట్టుతో పోటీపడనున్నాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి పోటీతత్వం అనుభవం తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు దక్కనుందన్నారు