నిజామాబాద్ సిటీ, వెలుగు : ఈనెల 18 నుంచి 21 వరకు హైదరాబాదులో జరిగిన సీఎం కప్-2024 జిల్లా బేస్ బాల్ జట్టు ప్రథమ స్థానం సాధించింది. సోమవారం ఆ జట్టును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. కార్యక్రమంలో డీవైస్ ఓ ముత్తన్న, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ కుమార్
జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శి మర్కంటి సుజాత, సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి ప్రిన్సిపాల్ పి.నళిని, సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల జిల్లా స్పోర్ట్ కోఆర్డినేటర్ నీరజ రెడ్డి, జిల్లా కోచ్ లు మౌనిక, హెచ్.అనికేత్ శ్రీలత, అంజలి పాల్గొన్నారు.