
మెదక్టౌన్, వెలుగు: అంతర్జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్పట్టణంలోని ఔట్డోర్ స్టేడియంలో ఇండియా ఖేలో ఫుట్బాల్ఆర్గనైజేషన్ఆధ్వర్యంలో 11 నుంచి 17 ఏళ్లలోపు బాల బాలికలకు టాలెంట్ హంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణనిచ్చారు.