- వినియోగంలోకి రాని పీడీయాట్రిక్ అదనపు వార్డు
- ఎంతమంది వచ్చినా ఒక్క వార్డులోనే ట్రీట్‌మెంట్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌లో పీడీయాట్రిక్ అదనపు వార్డును బొమ్మలు వేసి వదిలేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని పిల్లల వార్డులో బెడ్స్ సరిపోవడం లేదు. దీంతో డాక్టర్లు ఒక్కోబెడ్‌పై ఇద్దరి చొప్పున పడుకోబెట్టి ట్రీట్మెంట్చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో రూ.లక్షలు ఖర్చు చేసి బెడ్స్, పిల్లలను ఆకట్టుకునేలా రంగురంగుల కార్టూన్స్ తో పీడీయాట్రిక్వార్డును సిద్ధం చేసినప్పటికీ వినియోగంలోకి తీసుకురావడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు.
జిల్లా హాస్పిటల్ ఇటీవల టీచింగ్ హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ అయినప్పటికీ సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతోనే అదనపు వార్డును ఉపయోగించుకోవడం లేదని హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు. ప్రస్తుత పీడీయాట్రిక్ వార్డులో 38 బెడ్స్ ఉండగా.. 60 మంది వరకు పిల్లలు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఎంతమంది వచ్చినా గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్క వార్డులోనే ట్రీట్ మెంట్ చేస్తుండడంతో పిల్లల తల్లులు, బంధువులతో ఆ వార్డంతా కిటకిటలాడుతోంది.