దివీస్​ ల్యాబ్స్ లాభం రూ.430 కోట్లు

దివీస్​ ల్యాబ్స్ లాభం రూ.430 కోట్లు

న్యూఢిల్లీ: దివీస్​ ల్యాబ్స్​ లిమిటెడ్​ నికర లాభం ఈ ఏడాది జూన్​ క్వార్టర్​లో ఏడాది ప్రాతిపదికన 20.7శాతం పెరిగి రూ.430 కోట్లకు చేరుకుంది. అయితే సీక్వెన్షియల్​గా లాభం 20శాతం క్షీణించింది.  ఆదాయం 19.12శాతం పెరిగి రూ. 2,118 కోట్లకు చేరుకుంది. ఇబిటా 23.4శాతం పెరిగి రూ. 622 కోట్లకు ఎగిసింది. మార్జిన్ 28.3శాతం నుంచి 29.3శాతానికి పెరిగింది. లో బేస్​, భారీ అమ్మకాల కారణంగా లాభం పెరిగిందని కంపెనీ తెలిపింది. శుక్రవారం కంపెనీ షేర్లు ఎన్​ఎస్​ఈలో 1.74 శాతం పెరిగి రూ.4,973 వద్ద ముగిశాయి.