దివీస్ లాభం రూ.589 కోట్లు.. 65 శాతం పెరిగిన ప్రాఫిట్స్

దివీస్ లాభం రూ.589 కోట్లు.. 65 శాతం పెరిగిన ప్రాఫిట్స్

న్యూఢిల్లీ: దివీస్ ల్యాబొరేటరీస్‌‌‌‌కు కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ.589 కోట్ల నికర లాభం వచ్చింది. 2023 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.358 కోట్లతో పోలిస్తే ఈసారి ప్రాఫిట్ 65 శాతం పెరిగింది. రెవెన్యూ  రూ.1,855 కోట్ల నుంచి రూ.2,319 కోట్లకు ఎగిసింది. కాకినాడ ప్లాంట్‌లో జనవరి 1 నుంచి కార్యకలాపాలు మొదలయ్యాయని, ఇంకో 6 నెలల్లో  పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని దివీస్  ప్రకటించింది.  మరో ఐదేళ్ల కాలానికి గాను కిరణ్ ఎస్ దివీని  సీఈఓగా నియమించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.