నవంబర్​ 8నుంచి డీఏవో సర్టిఫికెట్ల వెరిఫికేషన్

నవంబర్​ 8నుంచి డీఏవో సర్టిఫికెట్ల వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) గ్రేడ్-2 పోస్టుల భర్తీ కోసం సర్టిఫికెట్ వెరిఫికేషన్ వచ్చే నెల 8 నుంచి ప్రారంభం కానుందని టీజీపీఎస్సీ ప్రకటించింది.  వెరిఫికేషన్ కు గాను ఇప్పటికే సాధారణ అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, దివ్యాంగులకు 1:5 నిష్పత్తిలో గుర్తించినట్టు అధికారులు చెప్పారు.  నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇతర వివరాలకు http://tspsc.gov.in సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు.