మాంటెసిల్వానో (ఇటలీ): హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదేండ్ల దివిత్ రెడ్డి అండర్–-8 వరల్డ్ క్యాడెట్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. మంగళవారం ముగిసిన 11 రౌండ్ల ఈ టోర్నీలో ఇండియాకే చెందిన సాత్విక్ స్వైన్, చైనా ఆటగాడు జిమింగ్ గుయోతో కలిసి 9 పాయింట్లతో సమంగా నిలిచాడు.
కానీ, టై బ్రేక్ స్కోరు ఆధారంగా దివిత్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. సాత్విక్ రజతం నెగ్గగా, గుయో కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన దివిత్ తొలి నాలుగు రౌండ్లలో గెలిచాడు. తర్వాత రెండు గేమ్స్‌లో ఓడినా వెంటనే పుంజుకున్నాడు. చివరి ఐదు రౌండ్లలో గెలిచి టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు.