Sania Mirza- Shoaib Malik: విడాకుల ప్రస్తావన.. తన సంసార జీవితంపై సానియా మీర్జా పోస్ట్

Sania Mirza- Shoaib Malik: విడాకుల ప్రస్తావన.. తన సంసార జీవితంపై సానియా మీర్జా పోస్ట్

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గతేడాది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. షోయబ్ పాకిస్థానీ మోడల్ అయేషా ఒమర్‌తో సంబంధాలు పెట్టుకున్నట్లు.. అదే వారి విడాకులకు కారణమని పుట్టగొడుగుల్లా అనేక కథనాలు వచ్చాయి. పైగా సానియా పాకిస్థాన్‌లో కన్నా ఇండియాలోనే ఎక్కువుగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరేది. కాలక్రమేణా ఆ పుకార్లు తగ్గినప్పటికీ.. దీనిపై వీరిద్దరూ నోరు మెదపలేదు. తాజాగా, ఈ జోడి వైవాహిక జీవితం మరోసారి తెరమీదకు వచ్చింది. 

విడాకులు, వివాహానికి సంబంధించిన ఒక ఆసక్తికర పోస్టును సానియా మీర్జా తన ఇన్‌స్టాస్టోరీలో పంచుకున్నారు. దీంతో వీరి విడాకుల ప్రస్తావన మరోసారి ఊపందుకుంది. "వివాహం కష్టం.. విడాకులు తీసుకోవడం కష్టం.. మీ కష్టమైన మార్గాన్ని ఎంచుకోండి.." అంటూ సొంత నిర్ణయాలు తీసుకునేలా పాఠకులను ప్రేరేపించడానికి ఉద్దేశించబడిన ఈ పోస్ట్ పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. వీరిద్దరి విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని, రేపో.. మాపో మేమిద్దరం విడిపోయామంటూ ఈ జోడి ప్రకటన చేస్తుందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా ఈ పోస్టుతో సానియా మీర్జా- షోయాబ్ మాలిక్ విడాకుల వ్యవహారం మరోసారి రెండు దేశాల్లోనూ చర్చకు దారితీస్తోంది. ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి తమ కుమారుడు ఇజాన్ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇంతలోనే ఏమయ్యిందో కానీ, సానియా మరోసారి సోషల్ మీడియాలో భోరుమనడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తీసుకుంటే.. తీస్కోండి లేదంటే ఏడవండి మాకేంటి ఈగోల అంటూ కొందరు నెటిజన్లు ఈ జోడి విడాకుల కథనాలపై పెదవి విరుస్తున్నారు. 150 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో మగవారు లేనట్లు.. ఓ పాకిస్తానీ పౌరుడిని వివాహం చేసుకున్నావని, అందుకు ఫలితం అనుభవించాల్సిందనంటూ ఎవరికి తోచింది వారు కామెంట్లు పెడుతున్నారు. 

ఈ జంటకు 2010లో వివాహం కాగా, వీరికి ఇజాన్ మీర్జా అనే ఒక కుమారుడు ఉన్నాడు.