![సంఘటితంగా లక్ష్యాలను సాధించాలి : దివ్య దేవరాజన్](https://static.v6velugu.com/uploads/2025/02/divya-devarajan-stresses-collective-achievement-of-goals-for-womens-empowerment_kslPyVn1vm.jpg)
- గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళలు సంఘటితంగా ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో మహిళా సంఘాల బలోపేతం కోసం చేపట్టిన కార్యక్రమాన్ని కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలపై హింసను ఎదుర్కొనేందుకు బాధిత మహిళలకు అండగా ఉండాలన్నారు. ప్రైవేట్, మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో పడకుండా మహిళలను ఆదుకొనేందుకు స్త్రీ నిధి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం మంది మహిళలు సంఘాల్లో లేరని, నిరు పేదలు, ఒంటరి, దివ్యాంగ, ఎస్టీ, ఎస్సీ మహిళలను సంఘాల్లో చేర్పించాలన్నారు. బీమా, పొదుపు గురించి అవగాహన కలిగించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, సెర్ప్ ఐబీ డైరెక్టర్ నవీన్, డీఆర్డీవోలు నర్సింహులు, నర్సింగ రావు, శ్రీనివాస్, మొగిలప్ప పాల్గొన్నారు.