
రవితేజ హీరోగా శరత్ మండవ డైరెక్షన్‌లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా సెట్స్‌కి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. రవితేజతో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. వారి పేర్లను నిన్న అనౌన్స్ చేశారు. అందులో ఒకరు దివ్యాంశ కౌశిక్. ‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన దివ్యాంశ.. మళ్లీ ఇప్పటికి తెలుగులో కనిపించబోతోంది. ఇక మరో హీరోయిన్.. మలయాళంలో రాణిస్తున్న రాజీషా విజయన్. తెలుగులో తనకిదే ఫస్ట్ సినిమా. ధనుష్ ‘కర్ణన్’ సినిమాతో కోలీవుడ్‌కి పరిచయమైన రాజీషా.. ప్రస్తుతం ఓ సినిమాలో సూర్యకి జంటగా నటిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ యునిక్ థ్రిల్లర్‌లో రవితేజ గవర్నమెంట్ ఎంప్లాయీగా నటిస్తున్నాడు. మరోవైపు ‘ఖిలాడీ’ మూవీ చేస్తున్న రవితేజ.. అందులోనూ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలతో రొమాన్స్ చేస్తున్నాడు. మొత్తానికి తను బ్యాక్ టు బ్యాక్ ఇద్దరేసి హీరోయిన్స్‌తో నటిస్తుండటం విశేషం.